శ్రీచరణ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్.. సమగ్ర దర్యాప్తు కోరిన కుటుంబ సభ్యులు
టెకీ రాధా గాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. అల్లుడు శ్రీచరణ్ ఇచ్చిన వివరాలు నిజం కాదని, తమ కుమార్తెను అతడే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేశారు.
శ్రీచరణ్‌తో పాటు అతని కుటుంబ సభ్యుల పాత్రపైనా అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ, వెంటనే అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఉత్తరాఖండ్ పోలీసులను కోరారు. ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.