కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో లభ్యమైనట్లు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ తెలిపారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలికతో పాటు ఆరుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. అతని మృతదేహం కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో లభ్యమైనట్లు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ తెలిపారు.

స్థానికులు అనుమానాస్పదంగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహం రాజ్‌కుమార్‌దేనని అధికారులు ధ్రువీకరించారు. సంఘటనా స్థలంలో విషం సీసా లభ్యమవడంతో అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.