ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కీలక అప్డేట్. ఈ పరీక్షల ఫలితాలను గురువారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.80 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు మరో అవకాశం కల్పించేందుకు ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.
ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ మార్కులు, గ్రేడ్‌లు, అర్హత వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.