ఇంగ్లండ్‌పై తొలి వన్డేలోనే జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. దాదాపు 968 రోజుల తర్వాత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన భారత స్టార్ పేసర్.. తన రాకను రెండు అరుదైన ఘనతలతో గుర్తుండిపోయేలా చేశాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్‌ను పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వికెట్లు (31) తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు 30 వికెట్లతో రవీంద్ర జడేజా పేరిట ఉండగా, తాజాగా బుమ్రా దానిని అధిగమించాడు.
అంతేకాకుండా, తన వన్డే కెరీర్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు. కేవలం 4,605 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన బుమ్రా.. భారత బౌలర్లలో అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు సాధించిన భారత బౌలర్లు:
మహ్మద్ షమీ – 4,070 బంతులు
కుల్దీప్ యాదవ్ – 4,513 బంతులు
జస్‌ప్రీత్ బుమ్రా – 4,605 బంతులు
గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన బుమ్రా.. తొలి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం కురిపించి, భారత బౌలింగ్ బలానికి మరోసారి తన విలువను చాటుకున్నాడు.