మేము పరమేశ్వరుని దగ్గరకు వెళ్తున్నాం, ఎలాంటి ఒత్తిళ్లూ లేవు’ అంటూ భారతి రాసినట్లు ఉన్న ఓ సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నక్కా భారతి (24), ఆమె ఇద్దరు కుమారులు తేజేశ్‌రెడ్డి (6), హేమనాథరెడ్డి (4) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భారతి, సునీల్‌రెడ్డి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. మంగళవారం ఇంట్లోనే ముగ్గురూ మృతిచెందారు. ఘటనాస్థలిలో "మేము పరమేశ్వరుని దగ్గరకు వెళ్తున్నాం.. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు" అనే విషయంతో ఉన్నట్లు చెప్పబడుతున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరణానికి అసలు కారణం పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.