కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు.. రాష్ట్రానికి నిధులు, పెట్టుబడులపై చర్చలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. విజయనగరం జిల్లాలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విభజన సమస్యలు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో పోలవరం నిధులు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో కొత్త పరిశ్రమల పెట్టుబడులు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలకంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.