బడ్జెట్ కొరత ఉన్నా అభివృద్ధి పనులు ఆగవని మంత్రి లోకేశ్ స్పష్టం
మంగళగిరి అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా వాదిస్తానని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రభుత్వ నిధులు పరిమితంగా ఉన్నప్పటికీ సీఎస్సార్ నిధులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇళ్ల పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్య వంటి కీలక అంశాలకు రెండేళ్లలోనే పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా నిడమర్రు పాఠశాల గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ వెల్లడించారు.