రేషన్ నిలిచిపోతుందా..? భయపడొద్దంటున్న అధికారులు
ఐదేళ్లలోపు పిల్లలకు కేవైసీ పూర్తికాకపోవడంతో వారి పేర్లపై రేషన్ నిలిచిపోతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ దుకాణాల పరిధిలో వేలాది మంది చిన్నారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ అంశంపై జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య స్పందిస్తూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదేళ్లలోపు పిల్లల కేవైసీ పూర్తికాకపోతే రేషన్ నిలిపివేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.