కేసు నుంచి తప్పించుకునే మార్గాలపైనా నిందితుల అన్వేషణ.. దర్యాప్తులో కీలక విషయాలు

కేతన్ అగర్వాల్ హత్యను ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి పక్కా స్కెచ్ రూపొందించినట్లు పుణె రూరల్ పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా నిందితులు కేతన్‌ను హత్య చేయడానికి కిరాయి హంతకుడిని ఉపయోగించే అవకాశంపైనా చర్చించినట్లు తెలిసింది. అయితే ఇందుకోసం ఎవరినీ సంప్రదించలేదని పోలీసులు తెలిపారు. అలాగే విషప్రయోగం సహా పలు మార్గాలపై పరిశోధన చేసినట్లు, హత్య అనంతరం కేసు నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపైనా సమాచారం సేకరించినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో డిజిటల్ ఆధారాలు, పరస్పరం పంపించుకున్న సందేశాలు, ఫోటోలు దర్యాప్తుకు కీలకంగా మారాయని పోలీసులు వెల్లడించారు.