భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్.. రేవంత్ సర్కార్‌పై విమర్శలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
తక్షణమే భేషరతుగా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉండి పాలకపక్షమే ధర్నాలు, నిరసనలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని అన్నారు.