వార్త:
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఇరువురు కీలకంగా చర్చించినట్లు సమాచారం.
గోదావరి–కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. శ్రీశైలం మార్గం కంటే బనకచర్ల మార్గం ద్వారా కావేరీ అనుసంధానం మరింత అనుకూలంగా ఉంటుందని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించినట్లు తెలిసింది.
సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి జలాలను దేశ ప్రయోజనాల కోసం వినియోగంలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సమన్వయం చేసి కేంద్రం ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇందుకోసం భాగస్వామ్య రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర జల్‌శక్తి శాఖ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం