సీసీటీవీ ఆధారాలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం.. ఇప్పటికే అరెస్ట్ అయిన కుమారుడు ఆరవ్ వర్మ

ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే ఆరవ్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ప్రమాదం నుంచి కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆరవ్ స్థానంలో సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని నిందితుడిగా చూపించి జైలుకు పంపే ప్రయత్నం చేశారని, బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టడంతో పాటు ప్రమాదానికి కారణమైన బైక్‌ను దాచిపెట్టి సాక్ష్యాలను మార్చే ప్రయత్నం చేశారని కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సహా సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.