కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఢిల్లీలో 25 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థులు, యువత ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా యువత న్యాయం కోసం పోరాడుతోందని, వారిపై దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను నిరాశపరిచారని ఆరోపించారు. "మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు" అంటూ విమర్శించారు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేస్తూ, మోదీపై మాట్లాడేందుకు ఆయన ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ వారి పక్షాన నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.